Mar 7, 2022, 11:25 AM IST
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు కోకాపేట నివాసం నుండి అసెంబ్లీకి బయలుదేరారు. ఇంటినుండి నేరుగా జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన మంత్రి హరీష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడోసారి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రికి వేదపండితులు ఆశీర్వచనం అందించారు. వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి హరీష్ అసెంబ్లీకి బయలుదేరారు. ఉదయం 11:30 కు శాసన సభలో హరీష్ రావు, మండలి లో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.