Nov 28, 2021, 3:12 PM IST
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారుప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. తాజాగా నగరంలోకి కూకట్ పల్లి వివేక్ నగర్ లో ఓ ఇంట్లో రేవ్ పార్టీ జరుగుతుండగా ఎస్వోటి పోలీసులు దాడిచేసి భగ్నం చేసారు. ఈ దాడిలో 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. పెద్ద మొత్తంలో మద్యం బాటిల్, కండోమ్ ప్యాకెట్ స్వాధీనపరుచుకున్నారు. యువకులంతా కలిసి ప్రతి వీకెండ్లో పార్టీ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వారంతా కూడా హోమో సెక్స్ వల్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం గత రెండేళ్లుగా అంటే 2019 నుండి ప్రతి శనివారం నడుస్తుందని పోలీసులు గుర్తించారు.