టెక్కి శారదకు టీటా బంపర్ ఆఫర్.. టెక్సాస్ యూనివర్సిటీ నుండి ఫ్రీ కోర్స్..

Aug 3, 2020, 6:21 PM IST

కరోనా కారణంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోల్పోయి కూరగాయలమ్ముకుంటున్న హైదరాబాద్ టెక్కీ శార‌ద‌కు తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) గొప్ప అవ‌కాశం క‌ల్పించింది. ఒక్క రూపాయి ఖ‌ర్చులేకుండా అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానానికి సంబంధించిన అంత‌ర్జాతీయ స్థాయి శిక్ష‌ణను అంద‌జేసేందుకు టీటా ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన ట్రైనింగ్ లెటర్ ను టిటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌క్తాల శారదకు అందించాడు. దీంతో పాటుగా టిటా తరఫున ల్యాప్‌ట్యాప్ అంద‌జేశారు. ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఉద్యోగాలు కోల్పోతున్న వారు శార‌ద‌ను ఆద‌ర్శంగా తీసుకోవాలని సందీప్ మ‌క్తాల అన్నాడు