రామగుండం సింగరేణి బొగ్గుగనిలో ఘోర ప్రమాదం... పైకప్పు కూలి ఆరుగురు మృతి

Mar 7, 2022, 5:12 PM IST


పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి బొగ్గుగనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  రామగుండం రీజియన్‌లోని  అర్జీ-3 పరిధిలోని ఆండ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు(ALP)లో బొగ్గు గని పైకప్పు కూలింది.  85వ లెవల్ వద్ద రూప్ బోల్ట్ చేస్తూ... కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా వారిపై పైకప్పు కూలింది. దీంతో కింద చిక్కుకుని ఆరుగురు కార్మికులు మృతిచెందారు.  మృతుల్లో ఓ అసిస్టెంట్ మేనేజర్ స్థాయి అధికారి సైతం వున్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు కార్మికులు సైతం కింద వున్నట్లు తెలుస్తోంది.  

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రెస్క్యూ టీం, భద్రత సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.