Children's Day video : అమాయకత్వమే పిల్లల సంపద

Nov 14, 2019, 3:05 PM IST

బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని సామాన్యశాస్త్రం గ్యాలరీలో  చిన్న పిల్లల ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. “Songs of innocence and of experience” పేరిట తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సమర్పిస్తున్న ఈ ప్రదర్శన సుకుమారమైన పిల్లల అమాయకత్వాన్ని, వారికే సొంతమైన అనుభవ ప్రపంచాన్ని అందంగా ఆవిష్కరిస్తోంది. ఈ ప్రదర్శన డిసెంబర్ 1 వరకూ వీక్షించవచ్చని ఫోటో జర్నలిస్ట్  కందుకూరి రమేష్ బాబు చెప్పారు.