Jan 18, 2021, 4:00 PM IST
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర వైన్స్‌లో దొంగతనం జరిగింది. నిన్న ఆదివారం కావటంతో గ్రామంలో ఉన్న మద్యం దుకాణంలో పెద్ద ఎత్తున విక్రయాలు సాగాయి. డబ్బు బాగా రావడం చూసి దొంగ వాటిపై కన్నేశాడు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి దాటాక చాకచక్యంగా షటర్‌ను పైకి లేపి వైన్స్ లోకి ప్రవేశించాడు. కౌంటర్లో ఉన్న సుమారు రూ. 6 లక్షల నగదుతో పాటు మద్యం సీసాలను కూడా దొంగిలించాడు. ఈ దోపిడీ మొత్తం దుకాణంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. వైన్స్ యాజమాన్యం ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు సీసీ పుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.