Jul 10, 2022, 2:54 PM IST
కరీంనగర్ : తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కొన్నిచోట్ల ప్రకృతి విలయం సృష్టిస్తే... అదే ప్రకృతి మరికొన్నిచోట్ల రమణీయంగా తయారయ్యింది. ఇలా వర్షపు నీటితో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ జలపాతం జలకళను సంతరించుకుంది. కొండలపైనుండి వయ్యారంగా నేలపైకి దూకుతున్న జలదారను చూసేందుకు ఇష్టపడని వారు ఎవరుంటారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నాయి.