Mar 15, 2023, 5:16 PM IST
సిద్దిపేట :ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో నిరుద్యోగ యువత పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఎలాగయినా ఈసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో రాత్రనకా పగలనకా చదువుతున్నారు యువత. ఇలా తన సొంత నియోజకవర్గం సిద్దిపేటలో విద్యార్థులు చదువుకునేందుకు మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయించారు మంత్రి హరీష్ రావు. ఈ గ్రంథాలయాన్ని తాజాగా సందర్శించిన హరీష్ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే విద్యార్థుల ఆకలి తీర్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా మర్నాటి నుండే పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు గ్రంథాలయం వద్దే భోజనం పెట్టే ఏర్పాట్లు చేసారు. ఇలా సొంత ఖర్చులతో రోజూ 400 మంది విద్యార్థులకు భోజనం ఏర్పాటుచేసి మరోసారి తన మంచిమనసును చాటుకున్నారు హరీష్ రావు.