కాటమయ్య బోనమెత్తిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు...

May 31, 2022, 4:17 PM IST

జనగామ: తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కాటమయ్య బోనమెత్తారు. నగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్ద వంగర మండలం చిట్యాల సురమాంబ శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయ బోనాల ఉత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా బోనమెత్తిన మంత్రి ఎక్కబెల్లి మహిళలతో కలిసి డప్పుచప్పుళ్ళ మధ్య గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు.