చిలుకూరు అడువుల్లోకి పారిపోయిన చిరుత.. అటవీశాఖ నిర్థారణ..

Bukka Sumabala   | our own
Published : May 16, 2020, 12:18 PM IST

గురువారం నుండి అటవీ సిబ్బందిని ముప్పు తిప్పలు పెడుతున్న చిరుత చిలుకూరు అడవుల వైపు వెళ్లింది.

గురువారం నుండి అటవీ సిబ్బందిని ముప్పు తిప్పలు పెడుతున్న చిరుత చిలుకూరు అడవుల వైపు వెళ్లింది. తాజాగా రాజేంద్రనగర్ మండలంలోని హిమాయత్ సాగర్‌లో చిరుత నీళ్లు తాగుతుండటాన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. బోనులో చిక్కకుండా, డ్రోన్లు, కెమెరాల కంట పడకుండా తప్పించుకున్న చిరుత అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. ఫామ్ హౌస్ ఏరియాలో చిరుత కోసం ఫారెస్ట్ అధికారులు గాలించగా.. ఏడు అడుగుల ఎత్తయిన గోడ మీది నుంచి దూకి తప్పించుకొని పారిపోయింది. పాద ముద్రల ద్వారా చిరుత గోడ దూకి వెళ్లిందని అధికారులు నిర్ధారించారు.ఇప్పటి వరకు 20 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు.. 4 సార్లు డ్రోన్ కెమెరాలతో గాలింపు జరిపారు. 2 మేకలను ఎరగా వేశారు. 10 కుక్కలను చిట్టడవిలోకి పంపారు. కానీ చిరుత జాడ మాత్రం లభ్యం కాలేదు. అయితే తాజాగా ఈ  చిరుతపులి శంషాబాద్ ప్రాంతం నుంచి వెళ్లిపోయినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

04:55కేంద్రమే అన్ని ఇస్తుంటే.. ధాన్యం కొనడానికి ఇబ్బందేంటి?: బండి సంజయ్ | Revanth Reddy | Asianet Telugu06:41సామాన్య కార్యకర్త కొడుకు పెళ్లికి హాజరైన కేసీఆర్ దంపతులు | Asianet News Telugu పవన్ కళ్యాణ్‌పై మాట్లాడే అర్హత నీకుందా? కల్వకుంట్ల కవితకి MP అర్వింద్ కౌంటర్ | Asianet News Telugu మీరేంట్రా ఆ ముగ్గురు పాపల వెంట పడ్డారు?: BJP Madhavi latha on Alekhya Chitti Pickles, HCU రేవంత్ ఇది గుర్తుపెట్టుకో.. HCU భూముల వివాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు | Asianet News Telugu HCU భూముల్ని చంద్రబాబు IMGకి ఇచ్చేస్తే.. వైఎస్ వెనక్కి తెచ్చారు: కల్వకుంట్ల కవిత | Asianet Telugu HCU: రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి కేఏ పాల్ వార్నింగ్ | Asianet News Telugu తెలంగాణలో మరో కొత్త నగర నిర్మాణం..అడ్డుపడితే జరిగేది ఇదే: రేవంత్ రెడ్డి | Asianet News Telugu కన్నతల్లే 14రోజుల పసికందును కడతేర్చింది: Hyderabad Police reveals baby de@th Mystery Revanth Reddy Vs KTR: అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మాజీ మంత్రి మాటల యుద్ధం | Telangana Assembly