Galam Venkata Rao | Published: Apr 3, 2025, 3:00 PM IST
తాము మళ్ళీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూ సమస్యను పరిష్కరించి 400 ఎకరాల విస్తీర్ణంలో గ్రాండ్ ఎకో పార్క్‌ను నిర్మిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని 'రియల్ ఎస్టేట్ బ్రోకర్' గా అభివర్ణించిన కేటీఆర్.. ప్రభుత్వం విద్యార్థులతో చర్చించకుండా దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. HCU విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.