Jan 17, 2023, 10:12 AM IST
హైదరాబాద్ : తెలుగు ప్రజలకు మరీ ముఖ్యంగా ఆంధ్రా ప్రజానీకానికి సంక్రాంతి అతిపెద్ద పండగ. ఈ పండక్కి ఎక్కడెక్కడో స్థిరపడినవారు సొంతూళ్లకు చేరుకుని బంధుమిత్రులతో పండగను ఆనందంగా జరుపుకుంటారు. ఇలా ఈ సంక్రాంతి పండక్కి హైదరాబాద్ నుండి సొంతూళ్లకు వేలాది వాహనాల్లో తరలివెళ్లిన ఆంధ్రా ప్రజలు. పండగ ముగియడంతో తిరిగి హైదరాబాద్ కు పయనమయ్యారు. ఇలా సంక్రాంతికి ముందు, ఇప్పుడు సంక్రాంతి తర్వాత హైదరాబాద్-విజయవాడ హైవే వాహనాలతో కిక్కిరిసింది. ఒకేసారి భారీ వాహనాలు వస్తుండటంతో చౌటుప్పల్ వద్ద 65వ జాతీయ రహదారిపై గల పతంగి టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు వేగంగా ముందుకు వెళ్లేలా ఏర్పాట్లు చేసినా వాహనాల తాకిడి ఎక్కువగా వుండటంతో బారులుతీరాయి.