30ఏళ్లుగా నీటిప్రవాహమే లేని వాగు... నిన్నటి వానతో ఎలా ప్రవహిస్తోందో చూడండి

Jul 15, 2021, 1:57 PM IST


కరీంనగర్: రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న, ఇవాళ(బుధ, గురువారాల్లో) కురుస్తున్న  వర్షాలకు వేములవాడ, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షాలతో రుద్రంగిలో గత 30సంవత్సరాలుగా నీటిప్రవాహం లేని నంది వాగు నేడు ఉద్రుతంగా ప్రవహిస్తోంది.