ఆరోగ్యవంతమైన తెలంగాణకోసమే వైద్య ఆరోగ్యశాఖ కృషి : ఈటెల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి (వీడియో)

Sep 24, 2019, 7:01 PM IST

తెలంగాణ గర్వించదగిన మెడికల్ ఇనిస్టిట్యూట్స్ ఉస్మానియా హాస్పిటల్ కిందే ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం మధ్యహ్నం ఒంటిగంటకు ఉస్మానియా హాస్పిటల్, మెడికల్ కాలేజ్ డాక్టర్లు, ఇతర సిబ్బంది తో జరిగిన ముఖాముఖిలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత వైద్యఆరోగ్యరంగంమీద ప్రత్యేకశ్రద్ధ పెట్టారని చెప్పారు. అన్నిసార్లు అన్ని వసతులూ అందుబాటులో ఉండకపోయినా ఉన్న వసతులతోనే ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని డాక్టర్లను కొనియాడారు. 

ఆరోగ్యవంతమైన తెలంగాణతోనే జ్ఞానవంతమైన తెలంగాణ వస్తుందని.. అదే ముఖ్యమంత్రి కేసీఆర్ కల అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో ఎన్నో ఇన్నోవేటివ్ విషయాలు సాధించింది. వీటిల్లో భాగమే కేసీఆర్ కిట్స్, కంటివెలుగు కార్యక్రమాలని చెప్పారు. అనేక ఆసుపత్రుల్లో కనీస అవసరాలు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సిజేరియన్స్ కాకుండా నార్మల్ డెలివరీలు పెరిగాయని ఇదంతా కేసీఆర్ కిట్స్ ప్రభావమేనని అన్నారు.


దేశవ్యాప్తంగా కేరళ, తమిళనాడు తరువాత తెలంగాణ రాష్ట్రమే అనేకరంగాల్లో కేంద్రప్రభుత్వంతో గుర్తించబడి అనేక అవార్డులు అందుకున్నదని చెప్పారు. అయితే వీటన్నింటిలోనూ ప్రభుత్వ ఆలోచనకు ప్రజల మెప్పు  వైద్య ఆరోగ్య శాఖలోని ప్రతి ఒక్కరూ పనిచేయడంతోనే సాధ్యమయిందన్నారు