పెద్దపల్లి జిల్లాలో పెళ్లింట విషాదం ... కాలిబూడిదైన బంగారం, నగదు

Mar 6, 2023, 10:16 AM IST

పెద్దపల్లి : వివాహం జరగాల్సిన ఇంట్లో అగ్నిప్రమాదం జరిగి పెళ్లికి దాచిన బంగారం, డబ్బులు కాలిబూడిదైన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన కాసాని ఐలయ్య ఇంట ఈ నెల(మార్చి) 18న పెళ్లి జరగాల్సి వుంది. ఇందుకోసం ఐలయ్య కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ సమయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఇంటికి మంటలు అంటుకుని పెళ్ళికోసం దాచిన వస్తువులతో పాటు ఇంట్లోని వస్తువులు కూడా దగ్దమయ్యాయి. దీంతో పెళ్లి వేడుకలతో ఆనందంగా వుండాల్సిన ఇంట విషాదం నెలకొంది.ప్రభుత్వం ఐలయ్య కుటుంబానికి సాయం చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేసారు.