Jul 13, 2020, 1:12 PM IST
పెద్దపల్లి జిల్లాలో ఓ డాక్టర్ మానవత్వాన్ని చాటుకున్నాడు. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాడు. దీంతో ఐసోలేషన్ వార్డులో ఉన్నవారు భయాందోళనలతో శవాన్ని వెంటనే తీసేయాలని పట్టుబట్టారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మున్సిపల్ సిబ్బంది స్పందించలేదు. కనీసం మున్సిపాలిటీ చెత్త వాహనంలోనైనా తరలిద్దామని ప్రయత్నిస్తే.. వాహనాన్ని ఆస్పత్రి ముందు పెట్టి డ్రైవర్ పారిపోయాడు. దీంతో కరోనా జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ శ్రీరామ్ కరోనారోగి మృతదేహాన్ని సిబ్బంది సాయంతో ట్రాక్టర్ లోకి ఎక్కించారు. తరువాత తానే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ. ఊరు చివారిలోని స్మశానవాటిక వద్దకు తీసుకెళ్లి, దహన సాంస్కారాలు పూర్తి చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.