కుక్క పిల్లలకు బారసాల... జంతుప్రేమను చాటుకున్న దంపతులు

Mar 25, 2021, 12:24 PM IST

పెద్దపల్లి: కుటుంబంలో భాగంగా మారిన పెంపుడుకుక్క ఇటీవలే 9పిల్లలకు జన్మనివ్వగా వాటికి బారసాల నిర్వహించి ప్రేమను చాటుకుంది ఓ కుటుంబం. జంతుప్రేమకు నిదర్శనంగా నిలిచే ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సాదుల కరుణాకర్-పద్మ దంపతులు ఒక ఆడ శునకాన్ని పెంచుకున్నారు. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న ఆ పెంపుడుకుక్క ఇటీవలే 9 పిల్లలను జన్మనిచ్చింది. దీంతో ఈ కుక్క పిల్లలకు మనుషులకు చేసిన విధంగానే బారాసల నిర్వహించారు కరుణాకర్ దంపతులు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని సాదుల పద్మ కరుణాకర్ అన్నారు.