Jul 22, 2020, 4:16 PM IST
కరోనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో వైద్యం కోసం రోగులు గంటల తరబడి లైన్లో నిలబడ్డ దుస్థితిని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. సామాన్య రోగులతోపాటు మూడు, నాలుగు గంటల పాటు కరోనా రోగులూ లైన్లో నిలబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని, వెంటనే ప్రభుత్వం..సంబంధిత అధికారులు దీనిమీద దృష్టి సారించాలని తెలిపారు.