Video : ధాన్యం కొనుగోళ్లపై కోత..కాంగ్రెస్ రాస్తారోకో...

Dec 21, 2019, 4:09 PM IST

జగిత్యాల జిల్లా వెల్గటూర్ లోని రాష్ట్ర రహదారిపై ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని కాంగ్రెస్ నాయకులు, రైతుల ధర్నా, రాస్తారోకోకు దిగారు. ధాన్యం కొనుగోళ్ల పై కోత విధించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే దాన్యం కొనుగోలు చెయ్యాలని, మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. దీంతో రహదారికిరువైపులా ట్రాఫిక్ స్తంభించింది.