ఒకప్పుడు మంచు ఫ్యామిలీ అంత అన్యోన్యంగా ఉండేదా!ఇలా ముక్కలు ఎందుకు అయ్యింది?

Published : Dec 13, 2024, 02:17 PM IST

మంచు కుటుంబంలో సంక్షోభం వివాదం కొనసాగుతోంది. ప్రస్తుతానికి కొంచెం చల్లబడినా, ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్లేదు. అయితే గతంలో ఈ ఫ్యామిలీ మెంబర్స్ చాలా అన్యోన్యంగా ఉండేవారో తెలిస్తే అవాక్కు అవుతారు. 

PREV
16
ఒకప్పుడు మంచు ఫ్యామిలీ అంత అన్యోన్యంగా ఉండేదా!ఇలా ముక్కలు ఎందుకు అయ్యింది?


మంచు కుటుంబంలో తలెత్తిన విబేధాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి.  మోహన్ బాబు ఏకంగా కొడుకు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మనోజ్ సైతం కేసు పెట్టాడు. జుల్ పల్లిలో గల మోహన్ బాబు ఫార్మ్ హౌస్ లో పెద్ద జరిగిన హైడ్రామా సంగతి తెలిసిందే. 
 

26
Mohan Babu, Manoj and Vishnu

 పరస్పరం దాడులు చేసుకుంటున్న క్రమంలో మనోజ్ జుల్ పల్లి ఫార్మ్ హౌస్ వద్ద ఒక 30 మంది బౌన్సర్స్ ని ఏర్పాటు చేసుకున్నాడు. మంచు విష్ణు ఒక 40 మందికి బౌన్సర్స్ ని నియమించుకుంటున్నాడు. విదేశాల నుండి హుటాహుటిన విష్ణు వచ్చారు. ఆయన మీడియాతో కూడా మాట్లాడాడు. మోహన్ బాబు ఇంటి నుండి మనోజ్ ని వెళ్ళగొట్టే ప్రయత్నం జరిగింది. 


అంతకు ముందు మనోజ్ ఫహడ్ షరీఫ్ సీఐ గురువారెడ్డిని కలిశాడు. తనతో పాటు మౌనికకు, కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు లో పేర్కొన్నారు. అయితే మోహన్ బాబు, విష్ణు పేర్లు ఆయన ఫిర్యాదులో చేర్చలేదు. పది మంది దుండగులు మా ఇంటిపై దాడి చేశారు. కిరణ్ రెడ్డి, విజయ్ రెడ్డి  సీసీ టీవీ ఫుటేజ్, హార్డ్ డిస్కులు ఎత్తుకుపోయారు. వారిని నిలువరించే క్రమంలో నాకు గాయాలు అయ్యాయని, మనోజ్ కంప్లైంట్ చేశాడు. 

 

36

మోహన్ బాబు తన పెద్ద కుమారుడు విష్ణుకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చారడని మనోజ్ అసహనం అట. అలాగే శ్రీ విద్యా నికేతన్ తో పాటు మంచు కుటుంబానికి ఉన్న విద్యా సంస్థల మీద ఆధిపత్యం మంచు విష్ణుదే. తిరుపతిలో గల విద్యాసంస్థలు ఆ కుటుంబానికి అతిపెద్ద ఆదాయ వనరుగా ఉంది. 
 

46
Manchu Manoj

విష్ణుని హీరోగా నిలబెట్టేందుకు మోహన్ బాబు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మనోజ్ తో సినిమాలు చేయడం లేదు. మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి ఆరేళ్ళు అవుతుంది. మెజారిటీ ఆస్తులు పంపకం అలానే ఉందట. వాటిపై ప్రయోజనాలు విష్ణు అనుభవిస్తున్నారట. లక్ష్మి, మనోజ్ ఈ విషయంలో మోహన్ బాబు పై కోపంగా ఉన్నారనే వాదన ఉంది.

56

అయితే గతంలో మంచు ఫ్యామిలీ మెంబర్స్ మధ్య గొప్ప అనుబంధం ఉండేదట. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు మనోజ్ ఈ మేరకు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అందరూ సినిమాలతో బిజీ.. అప్పుడప్పుడు కలిసి ట్రిప్స్ కి వెళ్లడం చేస్తారా? అని అడగ్గా... 

 

66
Mohan Babu


తరచుగా వెళుతుంటాము. డిన్నర్ మాత్రం ఖచ్చితంగా అందరం కలిసే చేస్తాము. ఎవరు ఎక్కడున్నా డిన్నర్ టైంకి ఇంటికి వచ్చేసి కలిసి భోజనం చేస్తామని మనోజ్ అన్నాడు. మరి అంతటి ఘాడమైన వీరి అనుబంధం బీటలు వారడానికి కారణం ఏమిటో తెలియదు. ఆస్తుల గొడవలే అని ప్రచారం జరుగుతుంది. నా పోరాటం ఆస్తుల కోసం కాదు, కుటుంబ క్షేమం, ఆత్మ గౌరవం కోసమని మనోజ్ మీడియాతో వెల్లడించారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories