Dec 14, 2022, 5:15 PM IST
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ టీమ్ హెడ్ సునీల్ కనుగోలు కార్యాలయంలో (వార్ రూమ్) పోలీసుల తనిఖీలు రాజకీయ ప్రకంపనలు రేపాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదు అందిందంటూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కార్యాలయంపై పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో పోలీసులతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి వాగ్వాదానికి దిగారు.