Galam Venkata Rao | Published: Feb 13, 2025, 7:00 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయం పట్టుకుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంటే.. రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని కాల రాస్తున్నారన్నారు. తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను వేధించిన వారిని వదిలిపెట్టబోమని.. తాము పింక్ బుక్ రెడీ చేస్తున్నామని, అధికారంలోకి వచ్చాక అంతకంత లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు.