Sep 2, 2019, 4:49 PM IST
తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ గారు నియమింపబడ్డప్పడినుండి రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చలు మొదలయ్యాయి. మామూలుగా గవర్నర్ పోస్టనేది సీనియర్ నేతలకు రిటైర్మెంట్ తీసుకున్న నేతలకు ఇస్తుంటారు. మరి ఇలాంటి క్రియాశీలక రాజకీయనేతకు గవర్నర్ పోస్టును ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఆక్టివ్ పొలిటీషియన్ ని బీజేపీ కన్నేసిన తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా పంపుతూ ఉండడంతో, తెలంగాణాలో రాజకీయంగా తమ స్పీడును బీజేపీ పెంచనున్నట్టు తేటతెల్లమైపోయింది.