Dec 17, 2019, 1:21 PM IST
వ్యాపారం పేరుతో మోసాలు చేస్తూ...అప్పులు తీసుకుని తిరిగి ఇవ్వమంటే వారిమీదే తప్పుడు కేసులు పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ జంటను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూసుఫ్ గుడ చెక్ పోస్ట్ ప్రాంతంలో నివాసం ఉండే అట్లూరి సురేష్ కుమార్, ప్రవిజ దంపతులు ఏకంగా పోలీసుల మీదే కేసులకు దిగారు. విషయం ఏంటంటే...ఈ దంపతులు రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు. ఈ క్రమంలో వాసుదేవశర్మ అనే వ్యక్తి దగ్గర 4.70 లక్షల రూపాయలు అప్పు పడ్డారు. తిరిగి అడిగితే ఇవ్వకపోగా, బెదిరించడంతో వాసుదేవశర్మ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నిమిత్తం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సురేష్, ప్రవిజలు పోలీసులు తమతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ CP కి కాల్ చేశారు. అంతేకాదు..ఈ విషయాన్ని ఓ వీడియో తయారు చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి వైరల్ చేశారు. దీంతో పోలీసుల మీద వ్యతిరేకత వెల్లవెత్తింది. ఈ విషయమై దర్యాప్తు చేసిన పోలీసులు అసలు ఈ జంటకు ఇదే పనని కొంతమంది రాజకీయనాయకుల పేర్లు చెప్పుకుని బ్లాక్ మెయిల్ చేస్తుంటారని తెలిసింది. వీరి మీద ఇప్పటికే 12 కేసులున్నాయని, గతంలో జూబ్లీహిల్స్ పోలీసులను కూడా ఇలాగే వేధించారని తేలింది.