Mar 5, 2023, 9:50 AM IST
హైదరాబాద్ : కేసీఆర్ సర్కార్ తెలంగాణ మహిళామణులకు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కానుకను ప్రకటించింది. ఈ నెల(మార్చి) 8న 'ఆరోగ్య మహిళ' పేరిట కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్యసేవలు అందించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు... మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో ప్రారంభించి రాష్ట్రమంతటా విస్తరించాలని చూస్తున్నట్లు హరీష్ తెలిపారు.