Sep 24, 2019, 3:03 PM IST
ఈ నెల సెప్టెంబర్ 28నుండి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలకోసం తెలంగాణ జాగృతి సంస్థ సిద్ధమవుతోంది. గతేడాది బతుకమ్మ సంబురాలకు దూరంగా ఉన్న కవిత ఈ సారి మళ్లీ బతుకమ్మను ఎత్తుకోబోతోంది. సెప్టెంబర్ 28న పెత్రమాసతో మొదలయ్యే బతుకమ్మ సంబురాలు అక్టోబర్ 6న జరిగే సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఎప్పటిలాగే ఈ సారి కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో బతుకమ్మ సంబురాలు జరగనున్నాయి. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లా, ప్రతి మండలంలో కూడా కార్యక్రమాలు జరుగుతాయని తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సారి బతుకమ్మను హరిత బతుకమ్మగా పాటించాలని చెప్పారు.