Nov 5, 2021, 11:00 AM IST
హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్ అనూహ్యమైన మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెసు అభ్యర్థి బల్మూరి వెంకట్ కు నామమాత్రం ఓట్లు మాత్రమే వచ్చాయి. Huzurabad Bypoll ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఈటల రాజేందర్ కు మధ్య పోరుగా పరిణమించింది. ఈ పోరును KCR అహంకారానికి, తన ఆత్మగౌరవానికి మధ్య పోరుగా పరిణమింపజేయడంలో Eatela Rajender విజయం సాధించారు. దాంతో కాంగ్రెసు అభ్యర్థి బల్మూరి వెంకట్ ఊసులోకి కూడా రాలేదు. కాంగ్రెసు ఘోర పరాజయంతో కాంగ్రెసు సీనియర్ నేతలు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని చిక్కుల్లో పడేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, హుజూరాబాద్ ప్రజలు దాన్ని కేసీఆర్ కు, ఈటల రాజేందర్ కు మధ్య యుద్ధంగానే చూశారు.