టార్గెట్ బిజెపి... యూపీ ఎన్నికల వేళ ప్రధాని ఇలాకాలో కేసీఆర్ క్రేజ్

Mar 3, 2022, 12:01 PM IST

వారణాసి: బిజెపిని టార్గెట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయస్థాయి స్థాయిలో పోరాటానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఇప్పటికే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నాయకులతో సమావేశమైన కేసీఆర్ ప్రస్తుతం డిల్లీ పర్యటనలో వున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఆయన బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ప్రధాని మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో పర్యటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలాన్నిస్తూ వారణాసిలో కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ నాయకుల ఫోటోలతో భారీ ప్లెక్సీలు, హోర్డింగ్స్ వెలిసాయి.