ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి చేరుకున్నారు. వారిద్దరి మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. భారత్– రష్యా సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.