vuukle one pixel image

Mahakumbh 2025: నిత్యం కోట్ల మందితో నిండిపోయే కుంభమేళా ఎంత క్లీన్ గా ఉందో చూడండి | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Feb 10, 2025, 11:00 PM IST

భారతదేశ గొప్ప సంప్రదాయం, సంస్కృతికి ప్రతీక అయిన మహా కుంభమేళా 2025ను ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని పరిశుభ్రంగా విజయవంతం చేయడంలో 'నమామి గంగే మిషన్' కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మిషన్‌కు సంబంధించిన ఆకర్షణీయమైన పెవిలియన్‌ను ఏర్పాటు చేయగా.. భక్తులు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ కేంద్రంగా నిలిచింది. పారిశ్రామిక వ్యర్థాలతో తయారుచేసిన ఇండియా మ్యాప్‌, ప్రత్యేక లైటింగ్‌తో గంగా నదిని ఆకట్టుకుంటుంది. ఇది గంగా స్వచ్ఛత, ప్రవాహానికి అద్దం పడుతుంది. ప్రవేశ ద్వారం వద్ద చెక్కి ఉన్న "నీరే జీవితం" అనే సందేశం మరింత ప్రత్యేకం. ఇది నీటి సంరక్షణ, పరిశుభ్రత ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఇంకా, పెవిలియన్ లోపలికి అడుగుపెట్టగానే ఒక ప్రత్యేకమైన ఇంటరాక్టివ్ బయోడైవర్శిటీ సొరంగం సందర్శకులను స్వాగతిస్తుంది. గంగా నది ఒడ్డున ఉన్న అద్భుతమైన జీవవైవిధ్యం అత్యాధునిక ఆడియో-విజువల్ ప్రదర్శన ద్వారా ప్రదర్శితమవుతోంది. పక్షుల కిలకిలరావాలు, నది ఒడ్డున ఉన్న సహజ సౌందర్యం మిమ్మల్ని గంగా నది ఒడిలోకి తీసుకెళుతుంది. దీని తరువాత, మంటపంలో ముందుకు కదులుతున్నప్పుడు, శివుని గొప్ప విగ్రహం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.