Jan 25, 2022, 5:00 PM IST
భారతదేశ కేంద్ర బడ్జెట్‌కు మరో వారం మాత్రమే మిగిలి ఉంది. ఎప్పటిలాగానే ఈసారి కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1 ఫిబ్రవరి 2022న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2014లో బిజేపి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 10వ బడ్జెట్ కాగా, ఆర్థిక మంత్రిగా సీతారామన్ కి నాలుగో బడ్జెట్. కోవిడ్-19 మహమ్మారి థర్డ్ వేవ్, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య ఈ బడ్జెట్ జనాదరణ పొందుతుందని భావిస్తున్నారు.