Mar 10, 2023, 9:57 AM IST
న్యూడిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలంటూ దేశ రాజధాని న్యూడిల్లీలో దీక్షకు సిద్దమయ్యారు. భారత జాగృతి ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద చేపట్టే ఈ దీక్ష కోసం సర్వం సిద్దమయ్యింది. కేవలం కేసీఆర్, కవిత ఫోటోలతో వేదికపై బ్యానర్ ఏర్పాటుచేసారు. 18 విపక్ష పార్టీల ప్రతినిధులు కవిత దీక్షకు మద్దతు తెలిపనున్నాయి.