సరూర్ నగర్ లో జరిగిన సకల జనభేరి సభలో కరీంనగర్-2 డిపో డ్రైవర్ బాబు గుండెపోటుతో మరణించడం బాధాకరం అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కార్మికులెవరూ ఆందోళన చెందవద్దు, మనో ధైర్యం కోల్పోవద్దన్నారు. గురువారం నాటి ఆర్టీసీ బంద్ కు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. ఆర్టీసీ బంద్ లో బీజేపీ శ్రేణులు పాల్గొనాలని ఎంపీ సంజయ్ పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.