బిఆర్ఎస్ జెండాలతో వెళ్లి కేటీఆర్ ను అడ్డుకుని... ఏబివిపి కార్యకర్తల ఆందోళన

బిఆర్ఎస్ జెండాలతో వెళ్లి కేటీఆర్ ను అడ్డుకుని... ఏబివిపి కార్యకర్తల ఆందోళన

Published : Jan 31, 2023, 04:56 PM IST

కరీంనగర్ : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

కరీంనగర్ : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య కేటీఆర్ కాన్వాయ్ వద్దకు చేరుకున్న ఏబివిపి కార్యకర్తలు ఆందోళనకు దిగి ఒక్కసారిగా షాకిచ్చారు. వివిధ అభివృద్ది కార్యక్రమాల కోసం కరీంనగర్ కు చేరుకున్న కేటీఆర్ గెస్ట్ హౌస్ వద్దకు చేరుకోగానే బిఆర్ఎస్ జెండాలతో కాన్వాయ్ వద్దకు వెళ్లారు ఏబివిపి నాయకులు. పోలీసులకు కూడా ఎలాంటి అనుమానం రాకపోవడంతో కాన్వాయ్ వద్దకు వెళ్లేందుకు అనుమతిచ్చారు. అయితే కేటీఆర్ కారు దగ్గరకు వెళ్లగానే ఒక్కసారిగా ఏబివిపి జెండాలతో ఆందోళన చేపట్టారు. అనుకోని పరిణామంతో అలెర్ట్ అయిన పోలీసులు ఏబివిపి కార్యకర్తలను అదుపులోకి తీసుకుని ఆటోలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

01:42మీరు గవర్నర్ కావచ్చు కానీ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ కావద్దా?: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
02:10RRR మూవీ కోసం కరీంనగర్ లో తోపులాట... ఎన్టీఆర్ అభిమానులపై థియేటర్ సిబ్బంది దాడి
00:18కరీంనగర్: శాతవాహన వర్సిటీలో ఎలుగుబంటి సంచారం, భయాందోళనలో విద్యార్ధులు (వీడియో)
05:58అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త
02:18కరీంనగర్ లో ఘోరం... ఎస్పారెస్పీ కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ పిల్లల ఆటో
04:23తెరాస కార్పొరేటర్ భర్త భూదందా... నాకు న్యాయం చేయండంటూ సామాన్యుడి సెల్ఫీ వీడియో
04:23తెరాస కార్పొరేటర్ భర్త భూదందా... నాకు న్యాయం చేయండంటూ సామాన్యుడి సెల్ఫీ వీడియో
00:30Karimnagar: అంత గొప్ప పేరు పెట్టుకుని... చేసేది ఇలాంటి నీచపు పనులా..!.
11:05omicron: కరీంనగర్ జిల్లాలో కరోనా కలకలం... విద్యార్థులకు భారీగా టెస్టులు
Read more