Dec 5, 2019, 11:04 AM IST
వారం రోజుల క్రితం శంషాబాద్ సమీపంలో గ్యాంగ్‌రేప్‌కు గురై హత్యకు గురై దిశ కేసులో నిందితులకు త్వరగా శిక్ష వేసేందుకు వీలుగా పాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు రాసిన లేఖకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. మహాబూబ్‌నగర్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో నిందితులు చర్లపల్లి జైలులో ఉ్ననారు. నిందితులను తమ కస్టడీలోకి తీసుకోవాలని షాద్‌నగర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.