మరో షాకింగ్ న్యూస్: మెగా హీరో వరణ్ తేజ్ కు కరోనా పాజిటివ్

Dec 29, 2020, 5:16 PM IST

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి మరో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. హీరో రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో మెగా హీరో వరణ్ తేజ్ కు కరోణా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఈ రోజు ఉదయం తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, కొద్దిపాటి కోవిడ్ లక్షణాలు కనిపించాయని వరణ్ తేజ్ ట్వీట్  చేశారు. తాను హోం క్వారంటైన్ లో ఉన్నట్లు కూడా తెలిపారు. తాను తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని, త్వరలోనే కోలుకుంటానని ఆయన చెప్పారు. తన పట్ల చూపుతున్న ప్రేమకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.