Jul 28, 2020, 11:28 AM IST
‘‘తెలుగులో ‘హార్ట్ ఎటాక్’, ‘క్షణం’ చిత్రాలు నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రేక్షకులు నా నుంచి మంచి చిత్రాలు కోరుకుంటున్నారు. ఈ చిత్రం కూడా అటువంటి మంచి చిత్రమే. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్నా’’ అని అదా శర్మ అన్నారు. విప్రా దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్రలో గౌరీ కృష్ణ నిర్మిస్తున్న చిత్రం ఇటీవల ప్రారంభమైంది. ‘‘ఇదొక మిస్టరీ థ్రిల్లర్’’ అని నిర్మాత అన్నారు. ‘‘హైదరాబాద్‌లో పది రోజులు చిత్రీకరణ చేసి, తర్వాత నిర్మల్‌లో చేస్తాం’’ అని విప్రా అన్నారు. ఈ చిత్రంలో సంజయ్, భానుశ్రీ, అభయ్, హరితేజ, అక్షితా శ్రీనివాస్ ఇతర ప్రధాన తారాగణం.