సెప్టెంబర్ 29న 17వ సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ (వీడియో)

Sep 26, 2019, 8:26 PM IST

ఈ నెల 29న  hicc novatelలో17వ సంతోషం అవార్డ్ ఫంక్షన్ తెలుగు, తమిళ,కన్నడ, మళయాల భాషల్లో జరగబోతోంది. దీనికి సంబంధించిన లోగోను పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి నభా నటేష్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. 

పెద్ద హీరోలనే కాదు తనలాంటి చిన్న హీరోలనూ సంతోషం అవార్డులతో సురేష్ కొండేటి ప్రోత్సహిస్తున్నారని సంపూర్ణేష్ బాబు కొనియాడాడు.  నటుడు సమీర్ మాట్లాడుతూ సురేష్ కొండేటి మొండి మనిషి అని,  ఏదైనా పట్టుకుంటే వదలడని అన్నారు. దీనివల్లే ఒక్క లాంగ్వేజ్ లో అవార్డు ఫంక్షన్లు చేయడమే కష్టమైన రోజుల్లో మొత్తం సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో కండక్ట్ చేస్తున్నాడని చెప్పాడు. 

సురేష్ కొండేటి మాట్లాడుతూ 29న HICC నోవాటెల్ లో జరిగే ఈ అవార్డ్ ఫంక్షన్ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు తెలిపారు.