కరోనాకు వ్యాక్సిన్ రాలేదు, రాదు.. ఫోన్ విసిరికొట్టిన బాలయ్య...

Nov 17, 2020, 3:39 PM IST

‘కరోనాకు వ్యాక్సిన్‌ రాలేదు... అసలు వ్యాక్సిన్‌ రాదు అంటూ నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ వస్తే కొంతమేర కరోనా వ్యాప్తి తగ్గే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్న వేళ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కరోనా వ్యాక్సిన్ రాలేదని, ఇక ముందు కూడా రాదని చేసిన వ్యాఖ్యలు షాక్ కు గురి చేస్తున్నాయి. అంతేకాదు కరోనా వ్యాక్సిన్ వస్తుందనే వార్తల్లో నిజం లేదని బాలకృష్ణ మరో షాక్ ఇచ్చాడు. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండడమే మంచిదని, కరోనా నిబంధనలు పాటించాలని, సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి కరోనా వ్యాప్తి జరగకుండా మన వంతు ప్రయత్నం చేయాలని బాలయ్య తెలిపారు.