గుంటూరు: పాతకక్షల నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వుండే ఓ కుటుంబంపై వైసిపి వర్గీయులు దాడికి పాల్పడ్డారు.
గుంటూరు: పాతకక్షల నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వుండే ఓ కుటుంబంపై వైసిపి వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన పల్నాడ్ జిల్లా నరసరావుపేట మండలంలోని పమిడిపాడులో చోటుచేసుకుంది. ఇనుప రాడ్లతో టిడిపికి చెందిన పారా వెంకటేశ్వర రావు ఇంటిపైకి వచ్చిన వైసిపి వర్గీయులు కుటుంబసభ్యులందరిపై దాడికి దిగారు. ఈ దాడిలో గాయపడిన వెంకటేశ్వరావు కుటుంబం ప్రస్తుతం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ చదలవాడ అరవింద్ బాబు వైసిపి శ్రేణుల దాడిలో గాయపడిన కుటంబాన్ని పరామర్శించారు. పాత కక్షలకు రాజకీయ విభేదాలు తోడవడంతో వెంకటేశ్వరరావు కుటుంబంపై ఇంత అమానుషంగా దాడికి తెగబడినట్లు తెలుస్తోంది.