ఏపీలో వైసీపీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలను బెదిరింపులకు గురిచేసి దాడులకు పాల్పడుతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తమ కార్యకర్తలను టార్గెట్ చేసి హతమారుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో బీసీ నాయకుడు లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. లింగమయ్యని హతమార్చాలనే బేస్‌బాల్ బ్యాట్‌తో కొట్టారన్నారు.