Galam Venkata Rao | Published: Mar 5, 2025, 8:00 PM IST
ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామికవేత్తలను కూటమి నేతలు తరిమేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ హయాంలో 40 లక్షల ఉద్యోగాలిచ్చామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగాలివ్వకపోగా... రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పారిశ్రామికవేత్తలను తరిమేస్తున్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు ఇవ్వకుండా మహిళలు, యువతను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.