Mar 6, 2022, 1:18 PM IST
గుంటూరు: ఇటీవల గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నపులూరు మక్కెవారిపేట చోటుచేసుకున్న బుల్లా సంజయ్(21) ఆత్మహత్యకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగుచూసాయి. తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ తన మొబైల్ లో రికార్డ్ చేసివుంచిన సెల్ఫీ వీడియోతో పాటు సూసైడ్ లెటర్ బయటపడింది. దీంతో మృతుడి తండ్రి కోటేశ్వరరావు వీటిని పోలీసులు అందించి ఫిర్యాదు చేసాడు. తన ఆత్మహత్యకు ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ రమేష్ తో పాటు అక్కాచెల్లెల్లు గోలి నిరీష, సుజాత కారణమని సంజయ్ వెల్లడించారు. వీరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని... తనకు ఈ విషయం తెలియడంతో ఎక్కడ బయటపెడతానోనని వేధింపులకు దిగారని వెల్లడించాడు. ప్రేమ పేరుతో నిరీష్ తన జీవితాన్ని నాశనం చేసిందని సంజయ్ వెల్లడించాడు.