సంక్షేమ పథకాల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని వైసీపీ ప్రభుత్వం పై యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధిని పక్కన పెట్టి అప్పుల మోత మోగించారని, ప్రజల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టారని ఆరోపించారు.