విశాఖపట్నం బీచ్ రోడ్డులో తాజ్ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో వరుణ్ బే శాండ్స్ పేరిట నూతనంగా నిర్మించ తలపెట్టిన అత్యాధునిక హోటల్, ఆఫీస్ టవర్ కు తల్లి నారా భువనేశ్వరితో కలిసి ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాజెక్టు విశాఖకు తలమానికంగా నిలుస్తుందన్నారు.