Dec 26, 2019, 3:36 PM IST
విశాఖ టీడీపీ అర్బన్ అధ్యక్షుడు రెహ్మాన్ రాజీనామా చేశారు. తాజా రాజకీయ పరిణామాలకు మనస్థాపం చెంది టీడీపీ పార్టీ అర్బన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్నారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం విశాఖ నేతలు బలయ్యారని తెలిపారు. రాజధాని రైతుల ఆక్రందనకు చంద్రబాబు స్టాండ్సే కారణమన్నారు. రైతులకు బాబు క్షమాపణ చెప్పాలి. సీఎం జగన్ కూడా రైతుల పరిస్థితిపై ఆలోచించాలి. పదవులతో నాకు పని లేదు. ప్రజల కోసం రాజకీయాలను పక్కన పెడతాం. వైజాగ్ ను కార్యనిర్వాహక రాజధాని గా స్వాగతిస్తున్నాం అన్నారు.