అర్థరాత్రి.. రోడ్డు మధ్యలో కొండచిలువ.. ఉలిక్కిపడ్డ గ్రామస్తులు ఏం చేశారంటే..

Jun 6, 2020, 10:59 AM IST

విజయనగరం జిల్లా, శృంగవరపుకోట పుణ్యగిరిలో కొండచిలువ కలకలం రేపింది. పుణ్యగిరి దేవస్థానం దగ్గర్లోని గిరిజన గ్రామంలో అర్థరాత్రి కొండచిలువ కనిపించింది. రాత్రివేళ బైటికి వచ్చిన వ్యక్తి మొదట దాన్ని చూసి పాము అనుకున్నాడు. ఆ తరువాత అది కొండచిలువ అని గమనించి మిగతావారిని 
లేపగా వారంతా కలిసి దాన్ని చంపేశారు. గత కొంత కాలంలో ఊర్లో కోళ్లు, మేకలు మాయమవుతున్నాయని అది కొండచిలువ పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. అటవీశాక అధికారులు చొరవ తీసుకుని వన్యప్రాణులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.