కందుకూరు దుర్ఘటనపై సీఎం తీరు సరికాదు... జగన్ కు మానవత్వమే లేదు : గోరంట్ల ఆగ్రహం

Dec 29, 2022, 12:23 PM IST

నెల్లూరు : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మానవత్వం లేదని టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన రోడ్ షో లో ప్రమాదవశాత్తు ఎనిమిది మంది మృతిచెందగా మరికొందరు గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఈ దుర్ఘటనపై స్పందించి సహాయసహకారాలు అందించడం, ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాల్సిన ముఖ్యమంత్రి ఎలా కేసులు పెట్టాలి, నేరారోపణలు ఎలా చేయాలో అని చూడటం దారుణమన్నారు. ఇలా మానవత్వంతో కాకుండా దుర్భుద్దితో ఆలోచించే సీఎం జగన్ కు ప్రజలే బుద్ది చెబుతారని...  ఆ రోజులు దగ్గర్లోనే వున్నాయని బుచ్చయ్యచౌదరి అన్నారు.