Jan 7, 2021, 5:01 PM IST
అనంతపురం: ఆంధ్ర ప్రదేశ్ లో గతకొంతకాలంగా హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై జరుగుతున్న దాడులపై సినీ నటులు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. రాష్టంలో అర్థంకాని పరిస్థితిని చూస్తున్నామని... ఇంద్రకీలాద్రిలో కనకదుర్గం ఆలయంలో నాలుగు సింహాలలో మూడు సింహాలు మాయం చేసినా ప్రభుత్వం చూసిచూడనట్లు వ్యవహరిస్తోందన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ లేపాక్షి మండలంలో బాలకృష్ణ పర్యటించారు.