Mar 6, 2023, 4:53 PM IST
చిత్తూరు : విశాఖపట్నంలో జరిగింది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మీట్ కాదు లోకల్ ఫేక్ సమ్మీట్ అంటూ ఎద్దేవా చేసారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ సమ్మిట్ లో ఒక్క అంతర్జాతీయ సంస్ధకూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదన్నారు. ఇక ఒప్పందాలు చేసుకున్న కంపనీల్లో చాలావరకు ఫేక్... అందుకే సంతకాలు,పత్రాలు, పేర్లు లేకుండా చీకటి ఎంవోయూలు చేశారని లోకేష్ ఆరోపించారు.
''ఇండోసోల్ అనేది ఒక పెద్ద ఫేక్ కంపెనీ... ఇందులో డైరెక్టర్లు పులివెందులకు చెందినవారే... కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో స్థాపించిన ఈ కంపనీ ఏపీలో రూ.76 వేల కోట్లు పెట్టుబడులు పెడుతుందట. అందుకే ఈ కంపనీకి కర్నూల్, కడపలో 25 వేల ఎకరాలు కేటాయిస్తారట.ఇలాంటి ఫేక్ కంపనీలే మరికొన్ని వున్నాయని... వాటితోనూ జగన్ సర్కార్ ఒప్పందం చేసుకుంది'' అని లోకేష్ ఆరోపించారు.